ఖమ్మం: రైతులు తొందర పడి పత్తి విత్తనాలు వేసుకోవద్దు

1చూసినవారు
ఖమ్మం: రైతులు తొందర పడి పత్తి విత్తనాలు వేసుకోవద్దు
రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో డీఏఓ పుల్లయ్య రైతులకు సూచనలు చేశారు. తొలకరి వర్షానికే తొందరపడి పత్తి విత్తనాలు వేసుకోవద్దని, పొడి దుక్కిలో విత్తనాలు వేస్తే శ్రమ వృథాతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకు మరికొన్ని రోజులు వేచి చూడాలని, వరి, మొక్కజొన్న కొయ్యలను కాల్చవద్దని ఆయన రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్