ఖమ్మం 24 డివిజన్ పోలియో హోం వెనుక ఉన్న టేకు చెట్లకు ఎండ తీవ్రత వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఎండిన ఆకులకు మంటలు వ్యాపించడంతో పొగలు అలుముకున్నాయి. స్థానికులు మాజీ కార్పొరేటర్ కమర్తపు మురళి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే ఫైర్ ఇంజన్, మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులను తెప్పించి మంటలను సకాలంలో ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు.