నేలకొండపల్లి మండల కేంద్రంలోని భూక్యా లక్ష్మికి చెందిన జొన్నరొట్టెలు, పండ్ల దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. వంట చేస్తుండగా పప్పు కుక్కర్ పేలి మంటలు వ్యాపించి, దుకాణం పూర్తిగా దగ్ధమైంది. వడగాల వల్ల మంటలు మరింత వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.50 వేల వరకు నష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపారు.