ఖమ్మం విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, కరెంట్ స్తంభాలపై ఇష్టారీతిన ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను సరిచేయాలని ఆపరేటర్లను ఆదేశించారు. ఈ వైర్లు అస్తవ్యస్తంగా వేలాడుతూ సమస్యలు సృష్టిస్తున్నాయని, మరమ్మతులకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. వారంలోగా వైర్లను క్రమబద్ధీకరించాలని, లేదంటే వాటిని పూర్తిగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.