ఖమ్మం: మాజీ మంత్రి పువ్వాడ వాల్‌ రైటింగ్‌

81చూసినవారు
ఖమ్మం: మాజీ మంత్రి పువ్వాడ వాల్‌ రైటింగ్‌
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరుగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరంలో స్వయంగా గోడపై వాల్‌ రైటింగ్‌ వేశారు. పెయింటింగ్‌ బ్రష్‌ చేత పట్టుకుని స్వదస్తూరితో ‘బీఆర్ఎస్’ కేసీఆర్ అని రాసి విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్