ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ, ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించామని, కారేపల్లి, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోని పలు కేంద్రాలకు ఇప్పటికే ఉచిత కనెక్షన్లు మంజూరు చేశామని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.