గ్రూప్-1, 2, 3, 4తో పాటు RRB, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ వచ్చే నెల 25 నుంచి 150 రోజులు ఉంటుందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 08742-230848, 95738 59598, 94419 31359 సంప్రదించాలన్నారు.