కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన సీపీఐ సమితి సమావేశంలో మాట్లాడుతూ, ఒక సామాన్య ఆటో డ్రైవర్‌ను కార్పొరేషన్ మేయర్‌గా తీర్చిదిద్దిన ఘనత సీపీఐ పార్టీదేనని కొనియాడారు. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.