ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఇంధన కొరత నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతతో ఆసుపత్రులు, అంబులెన్సులు, రైతుల హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ధాన్యం తరలింపు ఆగిపోయిందని, కార్మికులు,
చిరు ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ఆయన కోరారు.