ఖమ్మం: పిల్లలకు బాసటగా భవిత కేంద్రాలు

58చూసినవారు
ఖమ్మం: పిల్లలకు బాసటగా భవిత కేంద్రాలు
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పి. శ్రీజ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎనిమిది భవిత కేంద్రాలు ఉండగా, ప్రత్యేక అవసరాల పిల్లలకు చదువు చెబుతూనే సాధారణ పిల్లలుగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామని, భవిత కేంద్రాలను మోడల్ గా తీర్చిదిద్దే క్రమాన ప్రతిపాదనలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్