జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని, ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తెలిపారు.