ఖమ్మం: కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వండి

62చూసినవారు
ఖమ్మం: కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వండి
శానిటేషన్, ఇంజనీరింగ్ విజిట్ లో భాగంగా మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం ఖమ్మం 49వ డివిజన్ లో పర్యటించారు. డివిజన్లో ఎక్కడెక్కడ నీరు ఆగుతుంది అనేది పరిశీలించారు. రామాలయంకి వెళ్లే దారిలో కల్వర్టు చిన్నగా ఉండడంతో రోడ్డు ఎత్తు పెంచి, కల్వర్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం 19వ డివిజన్లో పర్యటించి అక్కడ రోడ్డు మీదికి నీళ్లు వస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్