ఖమ్మం: మోదీ నేతృత్వాన 12ఏళ్లుగా సుపరిపాలన

4చూసినవారు
ఖమ్మం: మోదీ నేతృత్వాన 12ఏళ్లుగా సుపరిపాలన
గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వర్ధిల్లుతోందని, ప్రజలకు సుపరిపాలన అందుతోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగుల సాధికారతకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా 52,243 మందికి, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 12,291 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించిందని వివరించారు.

సంబంధిత పోస్ట్