రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, విద్యాసంస్థల్లో అన్ని రకాల మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెంలోని టి. జి. ఎస్. డబ్యూ, ఆర్. ఎస్. బాలికల జూనియర్ కళాశాలలో రూ. 2. 25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మౌళిక సదుపాయాల అభివృద్ధి, మరమత్తుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.