ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూములను అధికారులు వెంటనే సంరక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ బృందం ఆక్రమణలకు గురైన స్థలాలను పరిశీలించింది. పేదల గుడిసెలకు కేసులు పెట్టిన అధికారులు, పెద్దలు అక్రమంగా నిర్మిస్తున్న షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలపై విచారణ జరపాలని కోరారు.