ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మెడికల్ షాపును 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి శోభ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్‌కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రెండు మెడికల్ షాపులను సాయంత్రం 4 గంటలకే మూసివేయడంతో ఆసుపత్రికి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.