రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండల కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలో ఆయన మాట్లాడారు. మండల అధ్యక్షుడిగా రేమల్ల రమేష్, ఉపాధ్యక్షులుగా భూక్యా శ్యామల, కేలోతు రామారావు, బానోతు వెంకన్నలు ఎన్నిక కాగా కార్యదర్శులుగా పి. నరేష్, ఎం. నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా తగరం రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు.