రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘ నాయకులు సీతారామయ్య, శరత్ బాబు శుక్రవారం ఖమ్మం నగరంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ, పెన్షన్ హక్కును ప్రభుత్వం భిక్షగా మారుస్తోందని ఆరోపించారు. ఉద్యోగ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ క్యాలెండర్లను ఆవిష్కరించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.