గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయడంతో పాటు ఆ శాఖ నుండి తొలగించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలో జార్జిరెడ్డి PDSU, AISF, SFI, PDSU ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి సంఘాల పట్ల అహంకారం ప్రదర్శించడాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గురుకుల సెక్రెటరీని సస్పెండ్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.