రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలోనే అవసరమైన మరమ్మతులు, మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలని, స్వంత భవనాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.