ఖమ్మం: పంట వ్యర్థాలు తగులబెడితే భారీ జరిమానా

2చూసినవారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధ ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యర్థాలను దహనం చేస్తే రూ. 5,000 నుంచి రూ. 25,000 వరకు పర్యావరణ జరిమానా విధించి, భూమి బకాయిల తరహాలో వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్