ఖమ్మంలో శనివారం జరిగిన సమావేశంలో బీఎస్పీ జోన్-2 ఇంచార్జ్ కర్రీ కృష్ణ, జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ దోపిడీ ఆగడం లేదని, దీనివల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ప్రతి తరగతికి నిర్దిష్ట ఫీజును నిర్ణయించాలని వారు కోరారు.