ఖమ్మం: భూనిర్వాసితులకు అత్యధిక పరిహారం

3చూసినవారు
ఖమ్మం: భూనిర్వాసితులకు అత్యధిక పరిహారం
సీతారామ ఎత్తిపోతల పథకం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం అత్యధిక పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి గ్రామాల రైతులతో సమావేశమైన ఆయన, సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీకి సేకరించాల్సిన భూమి, పరిహారంపై చర్చించారు. ఎకరా భూమికి రూ. 2.70 లక్షల ధరను రెట్టింపు చేసి, రూ. 5.40 లక్షలుగా పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం రూ. 10.80 లక్షల పరిహారం చెల్లించనుందని ఆయన వివరించారు.