కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు హోలీ సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మంగళవారం సాయంత్రం కోలాటం కార్యక్రమంతో హోలీని ప్రారంభిస్తారు. కుల పెద్దలు డప్పు కొట్టి ఈ సంబరాలకు శ్రీకారం చుడతారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. ఈ హోలీ వేడుకలు బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.