ఖమ్మం: ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపు

1చూసినవారు
ఖమ్మం: ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల కేటాయింపు
రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం లబ్ధిదారుల సమక్షాన ఇళ్లు కేటాయించాక ఆయన మాట్లాడారు. పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ నిర్వహించామని, తద్వారా ఎవరి ప్రమేయం లేకుండా ఇళ్ల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. చిమ్మపూడిలో 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించగా గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసినా ప్రస్తుతం వారికి ఇళ్ల కేటాయింపు పూర్తిచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్