ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్ల స్థానంలో బాధితులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, ఎంఎసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం అంబేడ్కర్ భవన్, టీటీడీసీ భవనంలో నిరాశ్రయులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపూరి వెంకటేశ్వరరావు, తూరుగంటి అంజయ్య, వంగూరి ఆనందరావు, కూరపాటి సునీల్, కొలికపోగు వెంకటేశ్వరరావు, నరసింహారావు, తూరుగంటి రాము పాల్గొన్నారు.