ఖమ్మం: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

0చూసినవారు
ఖమ్మం: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను వారు అభినందించారు.

సంబంధిత పోస్ట్