ఖమ్మం: ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

7చూసినవారు
ఖమ్మం: ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో డీఆర్‌డీఏ, పౌర సరఫరాల శాఖ, గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఈ శకటాలను తిలకించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలను ప్రజలకు చేరువ చేసేలా అవగాహన పెంపొందించడంలో సమర్థవంతంగా ప్రదర్శించిన అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు.

సంబంధిత పోస్ట్