ఖమ్మం నగరంలోని డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఉద్యాన అధికారిణి బెల్లం రాధిక సోమవారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనుల్లో లోపాలను గుర్తించిన అధికారిణి, కార్మికుల హాజరును పరిశీలించి, చెత్త సేకరణపై సిబ్బందికి సూచనలు చేశారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆమె స్పష్టం చేశారు.