ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించి పారిశుద్ధ్య లోపాలపై సిబ్బందికి సూచించారు. కార్మికులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, పనుల్లో అలసత్వం వహిస్తే సంబంధిత సిబ్బంది, ఉద్యోగులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణపై స్థానికుల నుంచి ఆరా తీశారు.