ఖమ్మంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారంతో ముగిసింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 3,14,501 జవాబుపత్రాలను 1,220 మంది అధ్యాపకులు ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం చేశారు. అయితే, రీకౌంటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుందని డీఐఈఓ తెలిపారు.