ఖమ్మం: అంతర్జాతీయ జీరో వేస్ట్ డే వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

1చూసినవారు
ఖమ్మం: అంతర్జాతీయ జీరో వేస్ట్ డే వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
ఖమ్మం కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంతర్జాతీయ జీరో వేస్ట్ డే వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లాలో వన్యప్రాణులు అధికంగా పెరుగుతున్నాయని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల అవి దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ జీరో వేస్ట్ డేను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్