ఖమ్మం: పెట్రోల్ ధరలు తగ్గించాలని ఐఎన్టీయూసీ నిరసన

0చూసినవారు
ఖమ్మం: పెట్రోల్ ధరలు తగ్గించాలని ఐఎన్టీయూసీ నిరసన
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ ఆఫీస్ నుండి బాబురావు పెట్రోల్ బంక్ మీదుగా మయూరి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇంధన ధరలను తగ్గించి సామాన్య ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.