ఖమ్మం గాంధీనగర్ కు చెందిన గుడారి రాజేందర్ రూ. 30, 57, 864కు గాను దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. ఫార్మా డిస్టిబ్ర్యూటర్ గా వ్యాపారం చేసిన ఆయన పలువురి వద్ద అప్పులు చేశాడు. ప్రస్తుతం నష్టం ఎదురై అప్పులు తీర్చలేని పరిస్థితి ఉందంటూ 24 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు.