ఖమ్మం: అంబేద్కర్ విగ్రహం వద్ద ఇనుప మెట్లు ఏర్పాటు చేయాలి'

2చూసినవారు
ఖమ్మం: అంబేద్కర్ విగ్రహం వద్ద ఇనుప మెట్లు ఏర్పాటు చేయాలి'
ఖమ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇనుప మెట్ల నిర్మాణం, ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించారు. నిత్యం ఎంతోమంది అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ ఉంటారని, పూలమాలతో నివాళులర్పించేందుకు వీలుగా ఇనుప మెట్లు ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి తెలిపారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్