అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం
బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అందుకు బీజేపీకి మద్దతు ఇచ్చేలా పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యత ఉంటుందని జిల్లా
బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం పార్టీ జిల్లా కార్యాలయంలో 15వ డివిజన్ కు చెందిన శ్రీరామ రవికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవకి వాసుదేవరావు, రుద్ర ప్రదీప్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.