ఖమ్మం కెజిబివి పాఠశాల ఆకస్మిక తనిఖీ

2చూసినవారు
ఖమ్మం కెజిబివి పాఠశాల ఆకస్మిక తనిఖీ
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఖమ్మం రూరల్ కెజిబివి పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యా స్థాయి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించి, వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. తరగతి గదులు, వసతి గృహాలను సందర్శించిన కమిషన్ సభ్యులు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్