జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఖమ్మం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాదర్ అలీ (ఖాదర్ బాబా) నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఏ. శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ చైర్మన్లను నియమించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ఖాదర్ అలీకి ఈ అవకాశం దక్కింది.