పర్యాటకాభివృద్ధి లక్ష్యంతో ఖమ్మం నగరంలోని ఖిల్లా వద్ద చేపడుతున్న రోప్‌వే పనులను కేఎంసీ కమిషనర్ శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రోప్‌వే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రస్తుత పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, పనుల నాణ్యతలో రాజీ పడకుండా, నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.