ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కేఎంసీలో మంగళవారం ఏఈఆర్వోలతో కమిషనర్ అభిషేక్ అగస్త్య సమావేశమయ్యారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పురోగతిని సమీక్షించి, ప్రస్తుతం 10 శాతం ఫారాల పంపిణీ పెండింగ్లో ఉండగా. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, బుధవారం నుంచి నింపిన ఫారాల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. యాప్‌లో వివరాలను అప్లోడ్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.