ఖమ్మం వెలుగుమట్ల భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ప్రచారాన్ని ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఖండించారు. అంబేద్కర్ భవన్‌లోని బాధితులను కొందరు వ్యక్తులు రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చే ప్రయత్నం చేశారని, ముందస్తు చర్యల్లో భాగంగానే వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు. కొన్ని మాధ్యమాల్లో వస్తున్న లాఠీచార్జ్ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.