ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన లేఔట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. పెండింగ్ లేఔట్ అనుమతులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో చర్చించి, ప్రతి దరఖాస్తుపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.