దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే గాంధీజీపై గాడ్సే తూటా పేల్చి హత్య చేశాడని, గాడ్సే ఆలోచనా ధోరణిని అవలంభిస్తున్న ఆయన వారసులను అడ్డుకుందామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు సెంటర్లో నిర్వహించారు.