ఖమ్మం శ్రీరాంనగర్లోని ఎల్ఐజీ ప్లాట్ల కేటాయింపునకు శనివారం డ్రా తీయాల్సి ఉండగా, దానిని వాయిదా వేసినట్లు హౌసింగ్ బోర్డు సీఈ జీవీ. రమణారెడ్డి తెలిపారు. 23 మంది దరఖాస్తు చేసుకున్న ఈ ప్లాట్లకు లాటరీ ద్వారానే నంబర్ ఖరారు చేయనున్నారు. కాగా, ఎల్ఐజీ ప్లాట్లు- విల్లాల మధ్య అక్రమంగా నిర్మించిన గోడ, గేటును హౌసింగ్ బోర్డు ఈఈ అంకమరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కూల్చివేశారు.