ఖమ్మం: 24గంటలు మద్యం దుకాణాలు బంద్

5చూసినవారు
ఖమ్మం: 24గంటలు మద్యం దుకాణాలు బంద్
హోలీ పండుగ సందర్భంగా ఖమ్మంలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలను నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సీపీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్