సూర్యాపేట జిల్లా చివెళ్ల గ్రామానికి చెందిన గుగులోత్ లక్ పతి వైద్యం కోసం ఖమ్మం నగరానికి వచ్చి, తన 35 గ్రాముల బంగారు ఆభరణాలను పోగొట్టుకున్నారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో, ఖమ్మం టూటౌన్ బ్లూ కోల్ట్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుడు వెళ్లిన ఆసుపత్రి, మెడికల్ షాపుల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి, పోయిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ రమేష్ సమక్షంలో వాటిని బాధితుడికి అప్పగించారు. పోలీసుల సత్వర స్పందనతో బాధితుడు తన ఆభరణాలను తిరిగి పొందగలిగాడు.