ఖమ్మం-మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి

71చూసినవారు
ఖమ్మం-మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి
తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన వనజీవి రామయ్య ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో రామయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం-మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్