బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా బద్దం మహిపాల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మంకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. అనంతరం, స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో, పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు.