ఈ నెల 28న నిర్వహించనున్న చలో మానుకోట లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి రాథోడ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించేలా ఐక్యత చాటాలని, గిరిజన సోదరులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొనాలని కోరారు.