కార్మికుల సమస్యలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 12 ఏళ్ల మోదీ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.